Thursday, February 6, 2025

రాజాస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డూడులోని NH-48లోని మోఖంపుర సమీపంలో బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బస్సు జైపూర్ నుండి అజ్మీర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  కారులో ఉన్న వారందరూ భిల్వారా నివాసితులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు కేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News