Wednesday, January 22, 2025

సంగారెడ్డిలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌లోని బీదర్ రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అవిరాజు (27), వీరేష్ (30)గా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏదో సమస్య కారణంగా ట్రక్కును రోడ్డు పక్కన నిలిపి ఉంచారని, అయితే కారు నడుపుతున్న వ్యక్తి దీనిని గమనించకపోవడంతో ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు  బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రెహ్మత్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్, కండక్టర్ తప్పించుకున్నారని ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదంతో యూసుఫ్‌గూడ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News