- Advertisement -
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడపలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి బీబి నగర్‌కు గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యలు వేముల వాడలో దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమై వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మల్లన్న గుడి మూల మలుపు వద్ద కల్వర్టు కోసం తీసిన భారీ గుంతలో కారు పడడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడిక్కకడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -