Sunday, December 22, 2024

ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ట్రాక్టర్, బైకు ఢీకొని బాలుడు మృతి చెందాడు. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం… అక్కన్నపేట మండలం సోమాజితండాకు చెందిన భూ నిర్వాసితుడు దరావత్ రాజు నందారం స్టేడి వద్ద నివాసం ఉంటున్నాడు. తన మూడవ కూమారుడైన దరావత్ తరున్ (12)తో కలిసి నందారం స్టేజీ వద్ద నుండి బైకుపై ప్రయాణిస్తున్నాడు.

రోడ్డు పక్కన ఓ నిర్వాసితుడు బోరు వేస్తుండగా దుమ్ముతో రోడ్డు కమ్ముక్కుపోయి ఎదురుగా వేగంగా వస్తున్న టాక్టర్ వాహనాన్ని డీ కొట్టడంతో తరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కన్నపేట ఎస్‌ఐ తాండ్ర వివేక్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News