Thursday, December 19, 2024

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మన తెలగాణ/సూర్యాపేట ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఈ ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందా రు. ప్రమాద స్థలంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. మృతుల్లో ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. స్థానికులు, సూ ర్యాపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జాతీయ రహదారి 65పై వెళ్తున్న ఆటో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన కారు ఈ ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న సరితా రెడ్డి (49), లూనావత్ రుక్కమ్మ (55), వేదశ్విని (17), మోక్షిత్ (7) మృతి చెందారు.

మృతులు అర్వపల్లి మండలం, చెందిన వా రుగా గుర్తించారు. మృతులు ఆటోలో సూర్యాపేటకు వెళ్తూ మార్గమధ్యలో ప్రమాదం జరగడంతో ఆటోలో ఉన్న 17 మందిలో నలుగురు మరణించగా, 13 మందికి తీవ్ర గా యాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వెంకట్రావు, సూర్యాపేట డిఎస్‌పి రవి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో తీ వ్రంగా గాయపడటంతో కొంతమందిని మెరుగైన చికిత్స కో సం హైదరాబాద్ తరలించినట్టు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News