Wednesday, January 22, 2025

తమిళనాడులో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు త్రిచి జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. త్రిచిసాలెం జాతీయ రహదారిపై తిరువాసి సమీపంలో ముందు వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో వ్యానులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపి కేసు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News