Sunday, January 19, 2025

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి సమీపంలో ఢిల్లీ-జయపుర జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ఓ వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఐదురుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… పలువురు గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహయాక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News