Monday, January 20, 2025

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

సీసీటీవీలో రికార్డ్ అయిన భయానక దృశ్యాలు

చెన్నై: తమిళనాడులో ధర్మపురి జిల్లా లోని తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద వంతెనపై వరుసగా వెళ్తున్న నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం సాయంత్రం మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సిసిటీవి కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనించగా, వేగంగా దూసుకొస్తున్న ట్రక్కు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రక్కులను ఢీకొంది. దీంతో ఒక ట్రక్కు అదుపు తప్పి వంతెనలో పడిపోయింది. ఈ మూడు ట్రక్కుల మధ్య వెళ్తున్న కారు నుజ్జు నుజ్జు అయింది.

ఇంతలోనే ఓ ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంలో అనుసరిస్తున్న మరోకారు కూడా ధ్వంసం అయింది. ఫలితంగా ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయాల పాలైన వారికి రూ.50 వేలు సహాయం అందించారు. ప్రమాదాలను నియంత్రించేందుకు నేషనల్ హైవే పనులు పూర్తి చేయాలని ధర్మపురి ఎంపి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News