Monday, January 20, 2025

బిఎస్‌పి అధినేత మాయావతి కాన్వాయ్‌కి అడ్డంకి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నగరంలో జరగనున్న బిఎస్‌పి బహిరంగా సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ అధినేత మాయావతి కాన్వాయ్ కొద్దిసేపు ఆగిపోయింది. బేగంపేటకు ప్రత్యేక విమానంలో వచ్చిన మాయావతి పార్క్‌హయత్ హోటల్‌లో బస చేసేందుకు కాన్వాల్‌లో వెళ్తుండగా బేగంపేట ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది.

దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడడంతో మాయావతి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కొద్ది సేపు ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిను క్లియర్ చేశారు. దీంతో మాయావతి కాన్వాయ్ ముందుకు కదిలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News