- Advertisement -
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో సంభవించిన ఘోర దుర్ఘటనలో సోమవారం రాత్రి అంతా ఒక శవంపై అనేక కార్లు దూసుకుపోయాయి. తుదకు ఆ రహదారిపై నుంచి శవాన్ని పోలీసులు షోవెల్‌తో తొలగించవలసి వచ్చింది. శరీర భాగాలు 500 మీటర్ల దూరం చెల్లాచెదురు అయ్యాయి. పోలీసులు అక్కడి నుంచి యథాతథంగా ఒక వేలును స్వాధీనం చేసుకోగలిగారు.
ఆ వేలిగుర్తులో మృతుని గుర్తించడానికి ఫోరెన్సిక్ బృందానికి వీలు అవుతుందని పోలీసులు ఆశిస్తున్నారు. ఆ ప్రదేశంలో కనిపించిన దిగ్భ్రాంతికరమైన విజువల్స్ ఒక పాదరక్షను కూడా చూపించాయి. అది మృతునిది అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉన్నందున వాహనదారులు ఆ మృతదేహాన్ని గుర్తించి ఉండకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -