Saturday, January 25, 2025

నార్సింగి ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి ఓఆర్‌ఆర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మియాపూర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్(55) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం ఉదయం కారు నంబర్ టిఎస్ 07 యూసి 5744లో ప్యాసింజర్ అనిల్ అనే వ్యక్తిని తీసుకుని గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు వెళ్తున్నాడు. ప్రయాణికుడిని తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఉదయం 6.30 గంటలకు ఎదురుగా వస్తున్న బొలేరో కారు వచ్చి ఢీకొట్టడంతో మహ్మద్ యూసుఫ్, అనిల్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News