Friday, April 4, 2025

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్

- Advertisement -
- Advertisement -

యువకుడి మృతి, అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్
కేసు దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…చందానగర్‌కు చెందిన వంశీ, సాయికిరణ్, రాము, శ్రీశైలం, మదన్‌కుమార్ కలిసి టిఎస్ 07హెచ్‌వై ఐ20 కారులో చందానగర్ నుంచి శంషాబాద్ వైపు ఓఆర్‌ఆర్ నుంచి వెళ్తున్నారు. కారును మదన్‌కుమార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, మదన్ అప్పటికే మద్యం తాగి ఉన్నాడు, మిగతా వారు కారులో కూర్చున్నారు.

మద్యం మత్తులో మదన్ కుమార్ కారును అతి వేగంగా డ్రైవింగ్ చేయడంతో టెక్ పార్క్ వద్ద ఉన్న మూలమలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో వంశీ అక్కడికక్కడే మృతిచెందాడు. సాయికిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వంశీ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News