Monday, January 20, 2025

పివిఎన్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : పిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నం నుంచి ఆరంఘర్ వైపు బైక్‌పై యువకుడు వెళ్తున్నాడు. పిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై బైక్‌లను అనుమతి తేకున్నా, యువకుడు ఎంట్రీ అయ్యాడు.

బైక్‌పై వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి 152వ పిల్లర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. వర్షంలో బైక్ స్కిట్ కావడంతోనే రోడ్డు ప్రమాదం జరిగినుట్ల భావిస్తున్నారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదం జరగడంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News