Wednesday, January 22, 2025

వైజాగ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: నలుగురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి దగ్గర బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన టాటా మ్యాజిక్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తాడేపల్లిగూడెం నుంచి వైజాగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News