Saturday, January 25, 2025

అతివేగం, మద్యం మత్తులో ప్రాణాలు హరీ

- Advertisement -
- Advertisement -
Road accidents due to alcohol intoxication
సైబరాబాద్‌లో గత ఏడాది 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 759 మంది మృతి
హైదరాబాద్‌లో 1,961 ప్రమాదాల్లో 278 మంది మృత్యువాత
రాచకొండలో 2,615 రోడ్డు ప్రమాదాల్లో 642 మంది అనంతలోకాలకు..

హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేగంగా వాహనాలను నడపడం, మద్యం తాగి వాహనాలను నడపడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారు. ఇలా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అర్థరాత్రి జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో బైక్‌లు, కార్లు అదు పు తప్పి డివైడర్లకు ఢీకొట్టడంతో మృతిచెందుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021లో 1,961 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 278 మంది వాహనదారులు మృతి చెందారు. 2020లో 1,843 రోడ్డు ప్రమాదాలు జరగగా 254 మంది వాహనదారులు మృతి చెందారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2019లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2,504, 2020లో 3,380 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

సైబరాబాద్ పో లీస్ కమిషనరేట్ పరిధిలో 2021లో 3,989 రోడ్డు ప్రమాదాలు జరగగా, 759 మంది మృతిచెందారు. ఇందులో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వారు ఎక్కువగా ఉన్నారు, రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో చాలామంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 2,350 రోడ్డు ప్రమాదాలు జరగగా 619మంది మృతిచెందారు. 2021లో జరిగిన 2,615 రోడ్డు ప్రమాదాల్లో 642 మంది మృతిచెందారు. 2020లో రోడ్డు ప్రమాదాల్లో 2,265 మంది గాయపడగా, 2021లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2,584 మంది గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది అమాయకులకు ప్రా ణాలు కోల్పోతున్నారు. పోలీసులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కూడా వాహనదారులు ఉల్లంఘించి ప్రాణాలు కోల్పోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసుల నిఘా తక్కువగా ఉండడంతో చాలామంది బైక్‌లు నడిపే వారు హెల్మెట్ పెట్టుకోకపోవడం, వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టు కోకపోవడంతో మృతి చెందుతున్నారు.

దీనిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు శివారు ప్రాం తాల్లో కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోని వారికి జరిమానా విధిస్తున్నారు. వరుసగా పోలీసులు తనిఖీలు చేపట్టడంతో స్థానిక రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. అయినా కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. చాలామంది వాహనదారులు మితిమీరిన వేగం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడిని ఇంటి వద్ద దింపి బైక్‌పై తిరిగి వస్తున్న యువకుడు అతివేగంగా బైక్‌పై రావడంతో అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన గచ్చిబౌలిలో గతంలో చోటుచేసుకుంది. మాదాపూర్‌లో రాంగ్ రూట్‌లో వెళ్లిన మరో యువకుడు కూడా కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఇలా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పలువురు యువకులు మృతిచెందుతున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. విధులు ముగించుకుని వస్తున్న ప్రీతం భరద్వాజ్ బైక్ అదుపు తప్పడంతో ఫ్లైఓవర్ నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు…

పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రతి రోజు నిర్వహిస్తున్నా కూడా చాలామంది మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు. మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు భార్యభర్తలను ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు యువకు లు మద్యం తాగి కారు నడపడంతో ప్రమాదం జరిగింది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు పార్ట్2 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. వారే కాకుండా బైక్ వెనుక కూర్చున్న వారు, కారు వెను కూర్చున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News