- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వనపర్తి జిల్లా కొత్తకోట(ఎం) నాటవెళ్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై కంటైనర్, డిసిఎం, లారీ ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. దీంతో రహదాపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడకు చేరుకున్న హైవే నిర్వహణ సిబ్బంది, పోలీసులు వాహనాలను తొలగించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
మరోవైపు దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. డిసిఎంను వెనుక నుంచి వెర్నా కారు ఢీ కొనడంతో కార్తీక్(38) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -