Sunday, December 22, 2024

11మంది బలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ, ఎపిల్లో రోడ్డు ప్రమాదాలు

వరంగల్‌లో రెండు ప్రమాదాల్లో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు,
నల్లగొండలో ఇద్దరు, కొత్తగూడెంలో బొగ్గు టిప్పర్ ఢీకొని ఇద్దరు,
మెదక్‌లో ఒకరు, సూరారంలో ఒకరు, ఎపిలో ఐదుగురు దుర్మరణం

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలోని రోడ్లు నెత్తురోడాయి. వివిధ జిల్లాల్లో ఆదివారం జరిగిన పలు ఘటనల్లో 11మంది మృతువాతపడ్డారు. వరంగల్‌లో ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌తోపాటు ఇద్దరు మహిళలు చనిపోగా, హన్మకొండ హంటర్‌రోడ్డు ప్లైఓవర్‌పై జరిగిన మరో ప్రమాదంలో ఆర్‌డబ్లుఎస్ ఇంజనీర్, ఆయన భార్య మృత్యువాతపడ్డారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో లారీ ఢీకొని ఇద్దరు, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా బొగ్గు టిప్పర్ ర్యాలీ ఢీకొ ని ఇద్దరు, మెదక్ జిల్లా రాయికోడ్ వద్ద ఆటో బోల్తాపడి ఒకరు, మేడ్చల్ జిల్లా సురారంలో డిసిఎం లారీని ఢీకొట్టిన ఘటనలో డిసిఎం క్లీనర్ దుర్మరణం పాలయ్యారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరిం గ్ కళాశాల సమీపంలో హైవేపై ప్యాసింజర్ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటో ఆటో డ్రైవర్ సింగారపు బబ్లు(25), ఎల్కతుర్తి మండలం వడ్డెర దండేపల్లికి చెందిన పల్లపు పద్మ(35), పల్లపు మీన(37)లు మృతి చెం దారు. హన్మకొండ హంటర్ రోడ్డు ప్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొని ప్రమాదం జరిగింది. ఘటనలో ప్లైఓవర్ పైనుంచి కారు కిందపడి ఒకరు, ఆస్పత్రికి తరలించగా మరొకరు చనిపోయారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన తాడూరి సారయ్య ఖమ్మం జిల్లాలో ఆర్‌డబ్లూఎస్‌లో అసిస్టెంట్ ఇంజనీరింగ్‌గా పని చేస్తున్నాడు. స్వగ్రామమైన రాజపల్లికి తన భార్య తో కలిసి కారులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్ద రు మృతి చెందారు. ఇదిలా ఉండగా, నల్లగొండ జిల్లా అడవి దేవులపల్లిలో లారీ ఢీకొని బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ప్రమాదంలో బాల్నేపల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి జక్కుల వెంకన్న(42), కారు డ్రైవర్ రమావత్ రంగా(28)లు బైక్‌పై వస్తుండగా, బాల్నేపల్లి నుంచి చిట్యాల వెళ్లే మార్గంలో మూలమలుపు వద్ద లారీ, బైకు ఢీకొన్నాయి. ఆర్‌ఎంపి వెంకన్న తలకు బలంగా గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెం దాడు. రమావత్ రంగాని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరి యా ఆస్పత్రిలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ్ల ఓసీకి వెళ్లే మార్గంలో బొగ్గు టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో అదే జిల్లాలోని ఎర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఈసం హనుమంతు(35), ఈసం స్వామి(40)లు దుర్మరణం పాలయ్యారు. పెళ్లిలో బాజాలు మోగించి తిరిగి వెళుతున్న క్రమంలో దాసుతండా సమీపంలో కోయగూడెం ఓసికి బొగ్గులోడుకు వెళుతున్న టిప్పర్ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో ఘటనాస్థలంలోనే హనుమంతు మృ తి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఈసం స్వామి మార్గమధ్యలో మృతి చెందాడు.

అటో అదుపు తప్పి బోల్తాపడడంతో ఉమ్మడి మెదక్ జిల్లా రాయికోడ్ మండలం మోరడ్గి గ్రామానికి చెందిన మొగులమ్మ మృతి చెందింది. కుటుంబ సభ్యులతోకలిసి మెదక్ చర్చికి వెళుతుండగా మామిడిపల్లి టి. జంక్షన్ వద్ద కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి అదు పు తప్పి ఆటో పక్కన ఉన్న గుంతలో పడిండి. దీంతో మొగులమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సూరారం కాలనీ వద్ద రోడ్డుపైకి వస్తున్న లారీని డిసిఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో డిసిఎం ముందుబాగం నుజ్జునుజ్జైంది. దాంతో ఆ వాహనానికి చెందిన క్లీనర్ రహుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. బహుదూర్‌పల్లి నుంచి డిసిఎం వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఎపిలో ఐదుగురు మృతి

కాగా, ఎపిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలతోసహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. వైఎస్‌ఆర్ జిల్లా మైలవరం మండలం తాడిపత్రి బైపాస్ రోడ్డలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలతోపాటు చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొని కలకడ మండలానికి చెందిన సోమశేఖర్ (18), జ్యోతి నాయుడు (19) దుర్మరణం పాలయ్యారు. గుట్టపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News