Sunday, December 22, 2024

17 బ్లాక్ స్పాట్ లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భారీ వర్షాల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వానాకాలంలో ఏర్పడే రోడ్ల డ్యామేజీలకు సంబంధించి అధికారులకు మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సచివాలయంలో రోడ్ల మరమ్మతులు, ప్ర మాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాల గురించి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ విజయేందిర బోయి, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల ప్రాంతీయ అధికారి రజాక్, నేషనల్ హైవే, జిహెచ్‌ఎంసి కమిషనర్, జీహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎన్‌హెచ్‌ఏఐ 65 రహదారిపై తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను ఈ సమావేశంలో మం త్రి కోమటిరెడ్డి అధికారులతో చర్చించారు. రోడ్లపై లాగిన్ పా యింట్ల మరమ్మతుల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలు ఇవే….
హైవేలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డికి వివరించారు. 17 బ్లాక్ స్పాట్‌ల్లో చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్‌రోడ్స్, ఈనాడు జంక్షన్, దురాజ్‌పల్లి జంక్షన్, ముకుందాపురం, అకుపాముల, కోమరబండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్‌రోడ్స్, నవాబ్‌పేట జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు మంత్రితో పేర్కొన్నారు.
డ్యామేజీ పనుల్లో వేగం పెంచాలి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్యామేజీ పనుల్లో వేగం పెంచాలన్నారు. వానాకాలంలో ముందస్తు చర్యలపై ప్రజలకు సూచనలు చేయాలన్నారు. పెండింగ్ ఫ్లైఓవర్లు నిర్మాణం, చిన్న వర్షానికి రోడ్లపై నిలుస్తున్న వరదలు, వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై మంత్రి పలు సూచనలు చేశారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సైన్ బోర్డ్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాం తాల్లో ప్రమాదాలను నివారించవచ్చని చెబుతూ వారికి సలహాలు, సూచనలు చేశారు. కొన్నిచోట్ల రహదారులు ఆరులేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్లు, సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి వాటి కోసం ప్రణాళికలు చేయాలని మంత్రి సూచించారు.

గత ప్రభుత్వం వల్లే ఆర్‌ఆర్‌ఆర్ ఆలస్యం
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజనల్ రిం గ్ రోడ్డుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రాజెక్టును కేంద్రం 2021లో మంజూరు చేసినప్పటికి ఇప్పటికీ ని ర్మాణం మొదలుకాకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రీజినల్ రింగ్ రోడ్డును ఉత్తర భాగానికి 161 కిలోమీటర్లు, దక్షిణ భాగానికి 190 కిలోమీటర్లు మొత్తంగా 351 కిలోమీటర్లుగా కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ఉత్త ర భాగం సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం (తిమ్మాపూర్) నుంచి ప్రారంభమై చౌటుప్పల్ వద్ద దక్షిణ భాగానికి కలుస్తుందని మంత్రి తెలిపారు.
ఉత్తరభాగంలో 70% భూ సేకరణ పూర్తి
ఉత్తర భాగం నిర్మాణాన్ని ఆరు ప్యాకేజీలుగా విభజించామని, ఇప్పటికే దాదాపు 70 శాతం భూసేకరణ పూర్తయ్యిందని, మిగతా 30 శాతం పురోగతిలో ఉందని మంత్రికి అధికారులు వివరించారు. మిగిలిన ఈ 30 శాతంలో నర్సాపూర్ పరిధిలో అటవీశాఖకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కొన్నిచోట్ల కోర్టు కేసు వివాదాలతో ఉన్న భూవివాదం కారణంగా భూసేకరణ ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News