Wednesday, January 22, 2025

ఇసుక లారీల తాకిడికి రోడ్డు నిలిచేనా..?

- Advertisement -
- Advertisement -

ధ్వంసం అవుతున్న రహదారి
అధికారులు దృష్టి సారించాలి

 

మనతెలంగాణ/దుమ్ముగూడెం:  భద్రాది కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో గల భద్రాచలం- చర్ల ప్రధాన రహదారికి ఇసుక లారీల తాకిడి వల్ల ప్రమాదం పొంచి ఉంది. మేడారం జాతర దృష్ట్యా లేక వెంకటాపురం, చర్ల మండలాల ఇసుక ర్యాంపులతో గానీ మండలం మీదుగా భద్రాచలం వెళ్లుతున్న ఇసుక లారీల అధిక లోడ్లతో పదికాలాలు పాటు నిలవాల్సిన రహదారి శిధిలావస్థకు చేరుకుంది. లారీల రాపిడితో తారు రోడ్డు పెచ్చులు పెచ్చులు పైకి లేచిపోయి గోతులు గోతులుగా ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా మండలంలో గల ప్రధాన రహదారి సురక్షితంగా ఉండేలా ఆర్ & బి అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనదారులు కోరుతున్నారు. మొత్తానికి నర్సాపురం నుంచి తురుబాకకు వెళ్లే భద్రాచలం… చర్ల ప్రధాన రహదారి ధ్వంసం అయిన తీరును చూస్తే ఇసుక లారీల తాకిడికి రోడ్డు నిలిచేనా..? అనేలా ఉన్న దృశ్యంను మన తెలంగాణ దినపత్రిక ప్రతినిధి తన చరవాణిలో బంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News