Thursday, January 23, 2025

మర్రిగూడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నల్గొండ: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్‌లో ఘూర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలోకి వెళితే..పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇద్దరు దంపతులు కారు మర్రిగూడ బైపాస్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి ఎదురుగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు ప్రయాణికులతో వస్తున్న జైలో వాహనం మీద పడడంతో అందులో ప్రయాణిస్తున్న 9మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన అమరారెడ్డి, స్వాతివర్థిని దంపతులు తన కుమారుడు మోక్షితో కలిసి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు.

మార్గమధ్యలో మర్రిగూడ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన దంపతులు వారి కుమారుడితో పాటు జైలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కమ్ ఓనర్ సింగం కృష్ణ (త్రిపురారం), ప్రయాణికులైన గోపీ (మిర్యాలగూడ), పూసపాటి పరబ్రహ్మం, (ఆళ్లగడప), ముఖేష్ (తడకమల్ల), శివాణి (తడకమల్ల), లక్ష్మమ్మ (మిర్యాలగూడ), మంజూల (మిర్యాలగూడ), శ్రావణి, (మిర్యాలగూడ), సత్యవాణి (తడకమల్ల) తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. కాగా గాయాలైన వారిలో ఆళ్లగడపకు చెందిన పూసపాటి పరబ్రహ్మం పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఇక ఎనిమిది మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News