Thursday, December 26, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్‌ వద్ద ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాపడిన ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

ఉట్నూరు డిపోకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్‌ మీదుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News