Wednesday, January 22, 2025

మేడిపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మేడిపల్లిః అతి వేగంగా లారీ నడుపడంతో లారీ దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మేడిపల్లి  శివారులో చేటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరిందర్ సింగ్ అతనితో పాటు జమ్మూకాశ్మీర్‌కు చెందిన సురుజిత్ సింగ్, పంజాబ్‌కు చెందిన జగ్గర్‌సింగ్ లారీలో ఖమ్మంలో గ్రానైట్ రాళ్లు లోడ్ చేసుకుని ఛండీఘర్‌కు వెళ్తున్నారు.

ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండల శివారులోని రైస్‌మిల్ వద్దకు చేరుకోగా లారీ డ్రైవర్ సుజిత్ సింగ్ లారీని అతివేగంగా అజాగ్రత్తగా నడుపడంతో లారీ ఎడమ వైపు చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న హరిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ సురుజిత్ సింగ్‌కు ఎడమకాలు తెగిపోయింది. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాల్జిత్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News