Monday, December 23, 2024

భైంసాలో విషాదం..

- Advertisement -
- Advertisement -

భైంసా : మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. నిర్మల్ ఏపి నగర్‌కు చెందిన భైంసా నాందెడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో నాందేడ్ వైపు నుంచి వస్తున్న కారును ఎదురుగా వెళుతున్న లారీ నాగదేవత సమీపంలో ఢీకొట్టింది. పట్టణంలోని పిప్రి కాలనీ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబానికి షిర్డి సాయిబాబాను దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆదిత్య (7) కళావతి (48) తీవ్రగాయాల పాలయ్యారు.

కారు డ్రైవర్ కార్తీక్ ఇతర కుటుంబ సభ్యులు శ్రేయాంక్, రోహిత్, రాములు సైతం తీవ్రగాయాలపాలయ్యారు అందులో ఆదిత్య, కళావతిలకు ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆదిత్యమృతి చెందాడు. వీరందరిని ఏరియాఆస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య కోసం ప్రైవేట్ ఆస్పత్రికితరలించారు. భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News