Monday, January 6, 2025

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్ర సమీపంలో జాతీయ రహాదారి నెత్తురోడింది. 44 వ నెంబర్ నేషనల్ హైవేపై కారును కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం కామారెడ్డి శివారులోని జాతీయ రహాదారి 44 గర్గుల్ బ్రిడ్జీ వద్ద కారును వెనుక నుంచి కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహోదర్(మోహన్)రావు 45 మధుసూధన్ రెడ్డి 57 అక్కడిక్కడే మృతి చెందారు.

మధుసూధన్ రెడ్డి, సిద్దిపేట్ మెడికల్ కళాశాల సీఈఓ తమ్ముడు అని తెలిసింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసిని స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సంఘటన స్థలానికి దర్యాప్తు చేస్తున్న దేవునిపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణంమైన కంటేనర్ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News