Wednesday, January 22, 2025

రోడ్ల గుంతలు ఇలా… నడిచేదెలా!

- Advertisement -
- Advertisement -

కోహీర్: వాహనాలపై వెళ్లేటప్పుడు తమతమ గమ్యస్థానాలకు సవ్యంగా వెళ్లాలంటేరో డ్లు బాగుండాలి.. అందులో మనం బాగుండాలి.. కా ని రోడ్లే గుంతలుగా మారితే వాహనదారులు ఎట్ల నడుపుతారు.. వారు ప్రయాణం ఎట్ల చేస్తరు.. ప్రా ణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందే మరి.. అది ఎక్కడోకాదు..మండల కేంద్రమైన కోహీర్‌లోని రోడ్ల పరిస్థితి.. చూడడానికి మాత్రం మండల కేంద్రం.. కాని రోడ్ల సమస్యలు చెప్పనక్కర్లేదు.. చినుకు పడితే మాత్రం రోడ్లన్నీ చిత్తడిగా మారి ఎప్పు డు ఏ వాహనంవచ్చి జారిపడతారో తెలియని పరిస్థితి నెలకొంది.. కాగా మండల కేంద్రమైన కోహీర్ శివారులోనిపెట్రోల్ పంప్ ఆవరణలో ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్ యూసుఫ్ ఖాన్ రోడ్డుపై ఉన్న గుంతదాటే క్రమంలో గాయాలై స్థానిక ఏరియాసుపత్రిలో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే..

ఈ సంఘటనే కాకుండా ఇదే రోడ్డుపై కోహీర్ పట్టణానికిచెందిన షాహిన్ బేగం తన భర్తతో కలిసి తన అక్టివ బైక్‌పై వెళ్తున్న క్రమం లో గుంత దాటుతుండగా అదుపుతప్పి గుంతలో పడి గాయాలు కావడంతోఆమెను స్థానికి ఏరియాసుపత్రికి తరలించగా మృతిచెందిన విషయం అందరికి విధితమే. ఈ రోడ్డుపై ఇలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. స్థానిక అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మండలంలోని కవేలి చౌ రస్తా నుంచి కోహీర్, బిలాల్‌పూర్, మనియర్‌పల్లి, తొరమామిడి మీదుగా నిత్యం మండల కేంద్రం నుం చి వాహనదారులు రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉ ండే ఈ రోడ్డు కావడం విశేషం. ఈ రోడ్డుపై గత ంలో మన తెలంగాణలో వచ్చిన వార్తకు స్పందించిన సంబంధిత శాఖ అధికారులు గుంతల్లోతాత్కాలికం గా కంకరతో మూయించారు.. కాగా మళ్లీ ఆ రోడ్డు గుంతమయంగా మారడంతో ప్రమాదాలు జరిగే అ వకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని మండల వాసులు, ప్రయాణికులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే గుంతలమయంగా మారిన రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతారా.. వేచి చూద్దాం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News