- Advertisement -
హైదరాబాద్ : వైన్స్ షాప్ మూసివేసి బైక్ పై వెళుతున్న వైన్స్ షాప్ క్యాషియర్ చేతిలో నుంచి రూ.6 లక్షల నగదు బ్యాగ్ ను హోండా యాక్టివా పై వచ్చిన గుర్తు తెలియని యువకులు అడ్డగించి దోచుకుపోయారు. సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ లక్ష్మి వైన్స్ ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మూసివేసిన క్యాషియర్ నవీన్ కలెక్షన్ డబ్బుల బ్యాగ్ తో తోటి సిబ్బంది తో బైక్ పై ఇంటికి బయలు దేరారు.వైన్స్ సుమారు 50 అడుగుల దూరంలో వెనుకగాహోండా యక్టీవా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా క్యాషియర్ చేతిలో బ్యాగ్ ను లా కొని పారిపోయారు. వెంటనే అప్రమత్తమై బైకుపై వెంబడించగా కొంత దూరం వెళ్ళాక హోండా యాక్టివా ను వదిలి నాల లో దూకి పారి పోయారు. సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సిసి ఫ్యూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -