Monday, December 23, 2024

రోడ్డు భద్రత మాసాన్ని అప్రమత్తతతో నిర్వహించాలి : డిజిపి రవి గుప్తా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తా అన్ని జిల్లాల ఎస్‌పి, కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత, రైల్వేలు విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్‌పిలు, కమిషనర్లతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత అండ్ రైల్వేల విభాగపు అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, డిఐజి రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్‌పి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్‌పిలు, పోలీస్ కమిషనర్లుతో డిజిపి మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ నెల రోజుల సమయాన్ని రోడ్డు భద్రత మాసంగా ప్రకటించిందని తెలిపారు. జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసంంగా మంత్రిత్వ శాఖ ప్రకటించిందని ఈ మేరకు నెల రోజులు పాటు పోలీస్ అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తతో ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీల ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాలక్రమేణ వాహనాల సంఖ్య పెరుగుతుండడం, రోడ్లు విస్తారంగా ఉన్నప్పటికీ ప్రయాణికులు తగిన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు.

2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 7500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా భారత దేశంలో 1,68,000 మంది చనిపోయారని గణంకాలు చెబుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడింగ్ ,డేంజరస్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తదితర కారణాలవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివిధ జిల్లాల పోలీసు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డిజిపి మాట్లాడుతూ రహదారులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బులను ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయంలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో , కమిషనరేట్ లలో కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఈ చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్ బ్రీత్ అనలైజర్స్ వంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘గుడ్ సమా రిటన్‘ పేరిట సన్మానం చేయాలన్నారు.ఈ రకమైన చర్యలు ఈ నెలకే పరిమితం కాకుండా దీర్ఘకాలంలోనూ అనుసరించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.

Road safety 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News