శరవేగంగా రోడ్ల మరమ్మతులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర రోడ్లు అందంగా ముస్తాబు అవుతున్నాయి. వర్షాలు పూర్తిగా తగ్గుము ఖం పట్టడం, శీతాకాలం ప్రవేశించడంతో నగర రోడ్ల మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగర రోడ్ల నిర్వహణను అంతర్జాతీయ స్థాయికి దీటుగా నిర్వహించేందుకు గాను ప్రధాన రోడ్డు మార్గాలను సిఆర్‌ఎంపిలో భాగంగా 7ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన విషయం తెలిసిందే. నగర రహదార్లను ఇందులో గ్రేటర్‌లోని మొత్తం 6 జోన్లలో 401 రోడ్ స్ట్రేచ్‌లను 709. 49 కిలో మీటర్ల మేర 5ఏళ్లపాటు ఈ సంస్థలే నిర్వహించనున్నాయి.
ఇందులో ఎల్‌బినగర్‌జోన్‌లో 138.77 కిలో మీటర్లు, చార్మినార్ 100.43 కి.మి, ఖైరతాబాద్ 1 81.50 కి.మి, ఖైరతాబాద్ 2, 90.50 కి.మి. శేరిలింగంపల్లి 108.44 కి.మి, కూకట్‌పల్లి 82.12 కి.మి, సికింద్రాబాద్ 107.73 కి.మీటర్ల మేర ప్రధాన మార్గాల నిర్వహణ బాధ్యతలను చేపట్టాయి. ఇందులో భా గంగా రోడ్లపై కొత్తగా తారు వేయడం మొదలు రహదారుల పొడువున గ్రీనరీ, జంక్షన్ల సుందీకరణ, లైన్ మార్కింగ్, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియం, రోడ్ సేప్టీ లేన్ మార్కింగ్ పెయింటింగ్ పనులను ఈ సంస్థలే బాధ్యత. ఇందులో భాగంగా గత ఏడాది 50 శాతం మేర రోడ్లను మరమ్మతులు చేపట్టాయి.
ఆయా సంస్థలు ఈ ఏడాదిగాను ఈ 7 సంస్థలు తమ తమ పరిధిలో 25 శాతం మేర రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కూడ నగరంలో భారీ వర్షాలు కురువడంతో నగరంలోని ప్రధాన రహదారులు పెద్ద ఎత్తున ధ్వంసం కావడంతో గుంతలను అప్పటీకప్పుడు పూడ్చినప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్డడంతో ఒప్పందంలో భా గంగా ఆయా సంస్థలు రోడ్ల మరమ్మతుల పనులను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ రీకార్పెటింగ్ పనులు కొనసాగుతుండడంతో ఉదయం కల్లా ప్రధాన రోడ్లు మార్గాలన్ని కొత్త అందాలను సంతరించకుంటున్నాయి. ఇందులో భాగంగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేసి, దెబ్బతినన చోట ప్యాచ్ వర్క్‌ను చేస్తున్నారు.
రోడ్ల నిర్వహణలో భాగంగా లైన్ మార్కింగ్, పుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియం, రోడ్ సేఫ్టీ లైన్ మార్కింగ్ పెయింటింగ్‌లను కొనసాగుతున్నాయి. 2021కుసంబంధించి సుమారు 160 కిలో మీటర్ల మేర రోడ్లపై రీకార్పెటింగ్ చేయాల్సి ఉండడం తో పనులను వేగం పెంచారు. జోన్ల వారీగా కొనసాగుతున్న రోడ్ల మరమ్మతులను పనులనుసిఆర్‌ఎంపి బాధ్యతలను పర్యవేక్షిస్తున్న చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్లతో పా టు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎప్పటీప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేస్తున్నారు. గుంతలతో నరకప్రాయంగా మారిన రోడ్లు పూర్తిస్థా యిలో మరమ్మతులకు నోచుకోవడంతో నగర ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.