Friday, January 10, 2025

మోరాయిస్తున్న అంతర్జాలం

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : తహసీల్దార్ కార్యాలయం నుండి ధృవీకరణ పత్రాలు పొందడానికి అన్న పానీయాలు మాని మీసేవ కేంద్రాల చుట్టూ 15 రోజలుగా తీరగాల్సి వస్తుందని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్వరం మండలంలోని మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రమైన లోకేశ్వరం గ్రామానికి చెందిన ప్రజలు కులం, ఆదాయం, నివాసం తదితర ధృవీకరణ పత్రాలు తీసుకునేందుకు మీసేవ కేంద్రాల వద్ద ఉదయం 9 గంటల నుండి పడిగాపులు కాస్తున్నారు.

ఈ సందర్భంగా పలువురు మండల వాసులు మాట్లాడుతూ బిసి కులవృత్తుల వారికి ఒక లక్ష రూపాయలు ఋణ సదుపాయం పొందేందుకు ఈ నెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనతో పాటు చదువుల కోసం విద్యార్థులు ధృవీకరణ పత్రాలు పొందెందుకై ఎంఆర్‌వో కార్యాలయం మీసేవ కేంద్రాల చుట్టూ గత 15 రోజలుగా ఎండలో తిరుగుతున్నామని సరిఫికేట్‌లు పొందడంలో జాప్యం ఎందుకు జరగుతుఉందని నిర్వాహకులను ప్రశ్నించగా సర్వర్ పనిచేయడం లేదని నెటవర్క్ సరిగ్గా రావడం లేదని సమాధానమిస్తున్నారని తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులస్తుల ఋణ సదుపాయం గడువును మరో 15 రోజులు పొడిగించాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని ఇకనైనా సంబంధిత అధికారులు నెట్‌వర్క్‌గా సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News