Sunday, December 22, 2024

వైరల్ వీడియో: ధైర్యంలేని ప్రియుడి కంటే.. మనసున్న దొంగే బెటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దొంగలకు భయపడి ఓ ప్రియుడు తన ప్రియురాలిని వదిలి పారిపోయాడు. దీంతో యువతి నిస్సహాయంగా చూస్తుండిపోయింది. యువతి పరిస్థితికి దొంగ కరిగిపోయి బ్యాగ్ తిరిగి ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో వీధి దోపిడీ సమయంలో దొంగలు ఒక అమ్మాయి బ్యాగును లాక్కున్నారు. కానీ వారు మనసు మార్చుకున్నారు. దొంగల్లో ఒకరు పారిపోవడానికి బదులు, దొంగిలించిన బ్యాగ్‌ను యువతికి తిరిగి ఇచ్చాడు.

బాలిక, అబ్బాయి కలిసి నడుచుకుంటూ వెళుతుండగా దుండగులు మోటార్‌సైకిల్‌పై వారి వద్దకు రాగానే ఈ ఘటన జరిగింది. యువతిని దొంగలతో ఒంటరిగా వదిలేసి ప్రియుడు తప్పించుకోగలిగాడు. ధైర్యంలేని ప్రియుడి కంటే.. మనసున్న ఆ దొంగే బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: కారు టాపుపై యువకుల హల్‌చల్: ట్రాఫిక్ పోలీసుల చలాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News