- Advertisement -
రంగారెడ్డి : పోలీసులమని ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి దోపిడీ చేసిన సంఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. పాండురంగ నగర్ లో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను ఇద్దరు దుండగులు అడ్డగించారు. పోలీసులం అంటూ బలవంతంగా జేబులో ఉన్న 3 వేల నగదు, రెండు సెల్, ఫోన్లు తీసుకొని ఉడాయించారు. వెంటనే బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు సర్దార్ జీలను అరెస్ట్ చేశారు.
Also Read: తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు ?: కవిత
- Advertisement -