Friday, April 25, 2025

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం.. రూ.7.5 లక్షల నగదు చోరీ

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాసంలో భారీ దొంగతనం జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోకి కొంతమంది దుండగలు చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న 7.5 లక్షల రూపాయల నగదును దుండగులు చోరీ చేసినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న జైపాల్ యాదవ్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై విచార చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News