Friday, April 4, 2025

రెచ్చిపోయిన దొంగలు.. రైలును ఆపి మరీ దోపిడి..

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: మంగళవారం అర్థరాత్రి సమయంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సాంకేతిక సమస్య సృష్టించి మరీ.. అల్లూరు రోడ్డు-పడుగుపాడు స్టేషన్ల మధ్య ప్రయాణికులను దోచుకున్నారు. సిగ్నల్‌లో సాంకేతిక సమస్య సృష్టించి బెంగళూరు ఎక్స్‌ప్రెస్, చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపిన దొంగలు ఇష్టారాజ్యంగా దోపిడికి పాల్పడ్డారు. బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-4, ఎస్-5, భోగీల్లో మహిళల మెడలోని బంగారం దోచుకెళ్లిన దొంగలు, పడుగుపాడు వద్ద మరికొందరి నుంచి బంగారం దోచుకున్నారు.

ఒక చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-2, ఎస్-3, ఎస్-5 భోగీలలో నగలతో పాటు బ్యాగ్‌లను కూడా అపహరించుకుపోయారు. ఆర్‌పిఎఫ్, జిఆర్పి బృందాలు నిర్లక్ష్యం వల్లే ఈ దోపిడి జరిగిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. అల్లూరు స్టేషన్‌లో సిసిటివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News