Sunday, January 19, 2025

ఢిల్లీలో వరుస దారి దోపిడీలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా దారి దోపిడీలు జరుగుతున్నాయి. గత శనివారం ప్రగతి మైదాన్ టన్నెల్‌లో జరిగిన దారి దోపిడీ మరిచిపోక ముందే మంగళవారం కశ్మీరీ గేట్ ప్రాంతంలో ఓ వ్యాపారి వద్ద నుంచి 4.5 లక్షల నగదుతోపాటు అతని స్కూటర్‌ను కూడా కాజేసి పరారయ్యారు. బుధవారం పోలీస్‌లు అందించిన వివరాల ప్రకారం కశ్మీరీ గేట్ వద్ద యుధిష్టిర్ సేతు ఫ్లైఓవర్‌పై మంగళవారం మధ్యాహ్నం వ్యాపారి తన స్కూటర్‌ను ఆపి ఫోన్‌లో మాట్లాడుతుండగా దుండగులు స్కూటీ, మోటార్ సైకిల్‌పై వచ్చి దోపిడీ చేశారు. స్కూటర్‌తో సహా మొత్తం 4.5 లక్షలు కాజేశారు.

బాధితుడైన వ్యాపారి సునీల్ కుమార్ జైన్ (56) షాడారా లోని బీహారీ కాలనీకి చెందిన వ్యక్తి. స్కూటర్‌పై ఇద్దరు వచ్చి పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి బెదిరించారు. డబ్బిమ్మని డిమాండ్ చేశారు. ఈలోగా మరో ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చి వారిలో ఒకడు వ్యాపారి జైన్‌ను స్కూటర్ తాళాలు అడిగాడు. తరువాత స్కూటర్‌తో సహా పరారయ్యారు. స్కూటర్‌లో 4.5 లక్షలు ఉన్నాయని వ్యాపారి జైన్ ఫిర్యాదు చేసినట్టు డిసిపి సాగర్ సింగ్ కాల్సీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News