Friday, December 20, 2024

నాగర్‌సోల్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో దారి దోపిడీ

- Advertisement -
- Advertisement -

జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్- పెండియాల్ మధ్యలో బుధవారం అర్ధరాత్రి భారీ రైలు దోపిడీ జరిగింది. రైలు రన్నింగ్‌లో ఉండగానే ట్రాక్ పక్కనే నిల్చున్న సుమారు 20 మంది దొంగల ముఠా ప్రయాణికుల మెడల్లోంచి బంగారు ఆభరణాలను లాక్కుని పరారయ్యారు. నాగర్‌సోల్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఈ ఘటనలో సుమారు 20 నుంచి 25 మంది ప్రయాణికుల నుంచి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. భారీ మొత్తంలో బంగారాన్ని దొంగలు దోపిడీ చేసినట్లుగా తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సమాచారాన్ని అందుకున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఏసిపి, కాజీపేట రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News