Wednesday, November 13, 2024

చెన్నై బ్యాంకులో దోపిడి..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇక్కడి అరుంబాకం ప్రాంతంలోని ఫెడ్‌బ్యాంక్‌లో శనివారం భారీ దోపిడి జరిగింది. సాయుధ దుండగులు బ్యాంకులోకి చొరబడి సిబ్బందిని బెదిరించి వారిని బాత్‌రూంలో బంధించి 32 కిలోల బంగారు నగలతో ఉడాయించారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మేనేజర్ నుంచి స్ట్రాంగ్‌రూం తాళాపు చెవులు తీసుకుని ఉద్యోగులను టాయ్‌లెట్లోకి పంపించి బంగారాన్ని సంచులలో తీసుకువెళ్లారని పోలీసు కమిషనర్ శంకర్ జీవల్ తెలిపారు. ఈ భారీ దోపిడి వెనుక బ్యాంక్‌లో పనిచేసే వారి హస్తం కూడా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల్లో ఒకరు బ్యాంకు ఉద్యోగి అని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుండగులు ముందుగా బ్యాంక్ సెక్యూరిటీగార్డుకు ఓ డ్రింక్ ఇచ్చారని, దీనితో ఆయన సొమ్మసిల్లి పడిపోయిన దశలో వీరు బ్యాంకులోపలికి చొరబడ్డారని వెల్లడైంది. శనివారం బ్యాంకుకు సెలవు అయితే కొన్ని లెక్కలు చూసుకునేందుకు కొందరు ఉద్యోగులు బ్యాంకుకు వచ్చినట్లు వెల్లడైంది.

Robbery in Fed Gold Bank in Chennai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News