- Advertisement -
వైరా : వైరాలో శనివారం రాత్రి దొంగలు హల్ చల్ సృస్టించారు. మధిర రోడ్‌లోని శ్రీనివాస ధియేటర్ ప్రక్కన సాయిరాం బేకరీలో సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే నల్లపూసల గొలుసుతో పాటు బేకరీ వస్తువులు, సిగరేట్ దిండులను దొచ్చుకున్నారు. సాయిరాం బేకరి యాజమాని భార్య గొలుసు ఇటివల తెగటంతో ఆ గొలుసును కౌంటర్‌లో వేయటంతో ఆ గొలుసును చోరీ చేశారు. ఇదే షాపులో ఇప్పటి వరకు మూడు సార్లు చోరీ జరిగిందని,
ఇంతవరకు తన సోత్తు రికవరీ జరగలేదని యజమాని ఏలే భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సాయిరాం బేకరి ప్రక్కనే వేంకటేశ్వర హోటల్‌లో దొంగలు తాళం పగలగొట్టి లొపలికి వెళ్ళినప్పటికి అక్కడ విలువైన వస్తువులు లేకపొవటంతో ప్రక్కనే ఉన్న నాగార్జున పురుగుల మందుల షాపు షట్టర్ తెరిచేందుకు ప్రవత్నం చేసి విఫలమయ్యారు. సంఘటన స్థలానికి వైరా పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -