Wednesday, January 22, 2025

బాల్కొండ ఎస్‌బిఐ ఎటిఎంలో చోరీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్‌బిఐ ఎటిఎంలో భారీ చోరీ జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎటిఎం నుండి రూ.24,92,600 చోరీ చేశారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వద్ద గల ఎస్‌బిఐ ఎటిఎంలో మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని దొంగలు మాస్కులు ధరించి ఒక తెల్లని కారులో వచ్చి గ్యాస్ కట్టర్ ద్వారా ఎటిఎం మిషన్‌ను కట్ చేసి, నగదును ఎత్తుకెళ్లారని ఎస్‌బిఐ ఎటిఎం ఛానల్ మేనేజర్ అవధూత నితిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శంకర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఎసిపి బస్వారెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, క్లూస్ టీం పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News