Wednesday, January 22, 2025

సినీ ఫక్కీలో కారును వెంబడించి రూ. 2 లక్షల దోపిడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రగతి మైదాన్ టన్నెల్‌లో పట్టపగలే కారును వెంటాడి , బెదిరించి రూ. 2 లక్షలు దుండగులు దోపిడీ చేశారు. ఈ సంఘటన సిసి కెమెరాకు చిక్కింది. కారులో వెళ్తున్న ఓ డెలివరీ ఏజెంట్‌ను నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లతో వెంబడించి ఆ కారును అడ్డుకున్నారు. తమ వద్ద ఉన్న గన్‌తో బెదిరించి కారులో నుంచి రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఎత్తు కెళ్లారు. గురుగ్రామ్‌లో క్యాష్ బ్యాగ్‌ను డెలివరీ చేసేందుకు వెళ్తున్న ఇద్దర్ని దుండగులు వెంటాడినట్టు పోలీస్‌లు తెలిపారు.

ఓలా క్యాబ్‌లో వెళ్తున్న డెలివరీ బాయ్ తన కారును రెడ్‌ఫోర్ట్ ఏరియాలో బుక్ చేసుకున్నాడు. అయితే రింగ్ రోడ్ వద్ద ఉన్న టన్నెల్ లోకి రాగానే రెండు బైక్‌లపై వస్తున్న నలుగురు అడ్డుకున్నారు. ఈ సంఘటనను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖండించారు. రాజధానిలో శాంతి భద్రతల సమస్యకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాయే కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎల్జీ రాజీనామా చేయాలని , భద్రతను కల్పించే వారికి అధికారం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రక్షణ కల్పించ లేక పోతోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News