Thursday, November 21, 2024

గన్‌పాయింట్‌తో 43.5 లక్షల దోపిడీ

- Advertisement -
- Advertisement -

Robbery of Rs 43.50 lakh by firing with gun

సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డ్రైవర్‌పై కాల్పులు 24గంటల్లో కేసు: సిపి శ్వేత

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : తుపాకీతో కాల్పులకు తెగబడి రూ.43.50 లక్షల ను ఎత్తికెళ్లిన సంఘటన సోమవారం సిద్దిపేట సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సంఘ టనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మ్మాట మాజీ సర్పంచ్, సిద్దిపేట పట్టణానికి చెం దిన నర్సయ్య పంతులు అనే వ్యక్తి స్తిరాస్థి వ్యాపా రం చేస్తుంటాడు. కాగా, స్థానిక హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న తన సొంత భూమిని ప్రభుత్వ ఉ పాధ్యాయుడు శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తికి గత నెలలో విక్రయించాడు. ఇందుకుగాను రూ.64.24 లక్షల కు వారి మధ్య ఒప్పందం కుదిరింది. అప్పట్లో అ డ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని నర్సయ్యకు శ్రీధర్ ఇ చ్చాడు. ఈ క్రమంలో సోమవారం నర్సయ్య, శ్రీధ ర్‌లు ఇద్దరు ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. కాగా, డాక్యమెంటేషన్ పూర్తయిన పిమ్మట డాక్యుమెంట్ రైటర్ కార్యాల యంలో శ్రీధర్ రెడ్డి నుంచి డబ్బులు తీసుకున్న నర్సయ్య.. వాటిని బ్యాగ్‌లో పెటి కారు డ్రైవర్ పరు శరాములుకు ఇచ్చి కారులోనే ఉండమని చెప్పి, రిజిస్రేషన్ చేసేందుకు కార్యాలయంలోకి వెళ్లాడు.

కాగా, బ్యాగ్‌తో డ్రైవర్ పరశురాములు కారులో కూర్చోగా.. అప్పటికే బైక్‌పై వచ్చి మాటువేసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారు కుడి బాగాన ఉన్న అద్దాన్ని ధ్వంసం చేయడానికి యత్నించారు. దీంతో అప్రమత్తమై డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదల్చబోగా దుండగులు కాల్పులు జరపగా డ్రైవర్ పరశురాములు ఎడమకాలికి బులెట్ గాయమైంది. అదే సమయంలో మరో దుండగుడు డ్రైవర్ పక్క సీట్లో ఉన్న బ్యాగును ఎత్తుకుని పరారయ్యాడు. దుండగులు కారులోనే తమ తుపాకిని వదిలి ఉడాయించారు. స్థానికులు డ్రైవర్ పరశురాములును చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎసిపి దేవారెడ్డి, సిఐ భిక్షపతిలు సంఘటన స్థలానికి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

ప్లాటు కొన్న వ్యక్తి పైనే అనుమానం
విక్రయదారుడు నర్సయ్య

పట్టణంలోని హాసింగ్ బోర్డు కాలనీలో ఉన్న తన స్వంత భూమిని గుడికందుల గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డికి విక్రయించినట్లు ప్లాటు విక్రయదారుడు నర్సయ్య తెలిపారు. ఈ ప్లాటు విషయంలో శ్రీధర్‌రెడ్డితో తనకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. దీంతో అతనిపైనే అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఈ విషయమై భూమి కొన్న శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జరిగిన ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్లాటు కొన్న డబ్బులను పూర్తిగా చెల్లించానని అంటూ.. ప్లాట్ అమ్మిన నర్సయ్య మాటల్లో నిజం లేదన్నారు. పోలీసుల విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయని, తనపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు.

24 గంటల్లో దుండగులను పట్టుకుంటాం
పోలీస్ కమిషనర్ శ్వేత
కాల్పులకు పాల్పడి డబ్బులను ఎత్తుకెళ్లిన దుండగులకు సంబంధించిన కేసును 24 గంటల్లోనే ఛేదిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. కాల్పులు జరిగిన ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా వ్యాప్తంగా 15 బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఐదు టీంలను రంగంలోకి దించామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News