- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతంపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. గుత్తి వద్ద ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడ్డారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ లైన్ క్లియర్ కోసం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ఆపారు. దీంతో దుండుగుల పది బోగోల్లో అర్ధరాత్రి దోపిడీకి పాల్పడ్డారు. నిజామాబాద్ టూ తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరగడంతో తిరుపతికి చేరుకున్నతరువాత రైల్వేపోలీసులకు బాధిత ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి గుత్తితో పలు రైల్వే స్టేషన్లలో విచారణ చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా దొంగలు గుర్తించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
- Advertisement -