హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామె డీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శక త్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేక ర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ “ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. జీవి ప్రకాష్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. డైరెక్టర్ వెంకీ, నే ను సినిమా చూసుకున్నాం. ఈ సినిమా మా కెరీర్ లో భారీ హిట్ మూవీ కాబోతుందని చాలా నమ్మకంగా చెప్పగలను. నేను, శ్రీలీల, రాజేంద్రప్రసా ద్, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో సీన్స్ చాలా అ ద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా చూసి పొట్ట చె క్కలయ్యేలా నవ్వుకుంటారు.
చాలా క్లీన్ కామెడీ ఉంటుంది”అని అన్నారు. హీరోయిన్ శ్రీలీల మా ట్లాడుతూ “వెంకీ నుంచి కొరుకునే వినోదం ఈ సినిమాలో ఉంటుంది. నా క్యారెక్టర్ మీరా చాలా స్పెషల్. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను”అని పే ర్కొన్నారు. డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ “ఈ సినిమాకి బ్యాక్ బోన్ నితిన్. ఈ సినిమా కథ నచ్చి సినిమా చేసిన శ్రీలీలకి థాంక్ యూ. నేను రాజేందర్ ప్రసాద్‌కి చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ ని. ఇందులో క్యారెక్టర్ ఆయన ఉద్దేశించి రాశాను. అది స్క్రీన్‌పై ఎంజాయ్ చేయాలి. సినిమాలో మం చి ఫన్ ఉంది”అని తెలిపారు. నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ “కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి కథ ఉన్న సినిమా ఇది. మంచి సక్సె స్ అవుతుందని అందరం చాలా నమ్మకంగా ఉ న్నాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రా జేంద్రప్రసాద్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.