Saturday, March 29, 2025

రాబిన్‌హుడ్ ఫన్ సినిమా

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీ స్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హైబడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీ టి రాజేంద్రప్రసాద్ కీలక పా త్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్న ర్ ప్రత్యేక అతిధి పాత్రలో న టించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ “-ఇందులో నా పా త్ర పేరు నీరా వాసుదేవ్. ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. తను తన సొంత ప్రపంచంలో ఉంటుంది. ఈ ప్రపంచమంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. ఈ క్యారెక్టర్ చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంటుంది.

తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నితిన్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ఫ్యామిలీ పర్సన్‌లాగా ఉంటారు. సినిమాని ఆడియన్స్ మంచి హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమాతో నితిన్, నాది హిట్ జంట అవుతుందనే నమ్మకం ఉంది. -వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ షూట్ చేస్తున్నప్పుడే పడి పడి నవ్వాము. ఇందులో వెన్నెల కిషోర్ కామెడీని చాలా ఎంజాయ్ చేశాను. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా హిలేరియస్‌గా ఉంటాయి. – ఇంత ఫన్ ఉన్న సినిమాని నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదు. నా కెరీర్‌లో పూర్తి ఫన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే సినిమా ఇది. ఇక ప్రస్తుతం పరాశక్తి సినిమా చేస్తున్నాను. రవితేజతో మాస్ జాతర చేస్తున్నాను. కన్నడ-, తెలుగులో జూనియర్ సినిమా చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. మేకర్స్ ప్రకటిస్తారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News