Sunday, December 22, 2024

క్రికెట్‌కు ఉతప్ప గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Robin Uthappa retires from all formats of Cricket

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు రాబిన్ ఉతప్ప బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2007లో టి20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో ఉతప్ప సభ్యుడిగా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఉతప్ప కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపిఎల్‌లోనూ ఉతప్పకు ఎంతో మెరుగైన రికార్డు ఉంది. 2012, 2014లలో ఐపిఎల్ ట్రోఫీ సాధించిన కోల్‌కతా టీమ్‌లో ఉతప్ప కూడా ఉన్నాడు. ఇక 2021లో ఐపిఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు కూడా ఉతప్ప ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు ఉతప్ప భారత్ తరఫున 46 వన్డేలు ఆడాడు. ఇందులో 934 పరుగులు చేశాడు. ఇక 13 టి20 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి 249 పరుగులు చేశాడు. కాగా, కెరీర్‌లో టీమిండియాకు, కర్ణాటకకు ఆడడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు ఉతప్ప పేర్కొన్నాడు.

Robin Uthappa retires from all formats of Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News