Wednesday, March 26, 2025

ఫ్యామిలీ చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ “రాబిన్‌హుడ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాల్లో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో నితిన్ మాట్లాడుతూ “జీవీ ప్రకాష్ కుమార్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఇది నాకు, శ్రీలీలకి సెకండ్ మూవీ. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది”అని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “ఇది ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ వెంకీ కుడుముల, నిర్మాత వై.రవిశంకర్, కేతిక శర్మ, రాజేంద్రప్రసాద్, ఎస్కేఎన్, వివేక్ ఆత్రేయ, రాహుల్ సాంకృత్యన్, సాయి రాజేష్, జీవీ ప్రకాష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News