Wednesday, March 26, 2025

నితిన్, నా కెరీర్‌లో బెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రాబిన్‌హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “నేను హీరోని బట్టి కథ రాస్తాను. రాబిన్‌హుడ్ ఐడియా ముందే వుంది. నితిన్‌తో ఫిక్స్ అయ్యాక ఆయనకి తగ్గట్టుగా కథని మలిచాను. రాబిన్‌హుడ్ జర్నీ వండర్‌ఫుల్‌గా జరిగింది. ఇందులో హీరో శారీరక బలం కంటే మానసిక బలం గొప్పదని నమ్మే వ్యక్తి. సినిమాల్లో ఫస్ట్ 20 నిమిషాలు హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేయడానికి రకరకాల గెటప్స్ అలరిస్తాయి. 20 నిమిషాల తర్వాత కథ మారిపోతుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో, నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. -ఇందులో ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. నిర్మాతలు ఎవరని అడిగినప్పుడు డేవిడ్ వార్నర్ అని చెప్పాను. నిర్మాత రవి చాలా సీరియస్‌గా ప్రయత్నించి వార్నర్‌ని ఢిల్లీలో కలిసే ఏర్పాటుచేశారు. ఆయన కథ విని ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పారు. ఇందులో శ్రీలీల క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌లో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. -ప్రొడ్యూసర్స్ మొదట పుష్ప సినిమాలో కేతికతో ఒక స్పెషల్ నెంబర్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. ఈ సినిమాలో ఆ అవకాశం ఉన్నప్పుడు కేతిక అయితే బాగుంటుందని అనుకుని ఈ సాంగ్ చేయించాం. -ఇక భవిష్యత్తులో తప్పకుండా చిరంజీవితో సినిమా చేస్తాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News