Saturday, January 4, 2025

’భీష్మ’ మ్యాజిక్ ‘రాబిన్‌హుడ్’తో పునరావృతం

- Advertisement -
- Advertisement -

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ “నేను, వెంకీ కలిసి చేస్తున్న సెకండ్ ఫిల్మ్ రాబిన్‌హుడ్. ’భీష్మ’ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ పునరావృతం అవుతుందని భావిస్తున్నాను. శ్రీలీలతో కూడా ఇది నా సెకండ్ ఫిల్మ్. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. డిసెంబర్ 25 నాడు రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుని రెట్టింపుతో సహా మీనుంచి దోచుకొని వారికి ఇస్తాడు.

గ్యారెంటీగా చెబుతున్నా. ఈ క్రిస్మస్ మాదే”అని అన్నారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ “రాబిన్‌హుడ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నా పాత్ర పరంగా, నటన పరంగా చాలా విభిన్నంగా ఉండే సినిమా ఇది”అని తెలిపారు. డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ “నన్ను ఎంతో బలంగా నమ్మి సపోర్ట్ చేసే నితిన్ అన్నకి థాంక్యూ. శ్రీలీలని ఇప్పటివరకు అందరూ డాన్సింగ్ క్వీన్ అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, లిరిసిస్ట్ కేకే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News