Sunday, January 19, 2025

వినోదం, యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ‘రాబిన్‌హుడ్’ టీజర్

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ రాబిన్‌హుడ్. ఈ సినిమా పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గురువారం అడ్వెంచర్, ఎంటర్‌టైనింగ్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైంది. నితిన్ ధనవంతుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక లక్షం డబ్బు.

అయితే అతను పవర్‌ఫుల్ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీలీలని ఇష్టపడతాడు. ఈ నేపథ్యంలో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. వినోదం, యాక్షన్‌తో దర్శకుడు వెంకీ కుడుముల ప్రేక్షకులను కట్టిపడేశాడు. నితిన్ రాబిన్‌హుడ్‌గా అదరగొట్టాడు. శ్రీలీల తన పాత్రలో అలరించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో పాత్రలను కూడా టీజర్ పరిచయం చేసింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సినిమాపై ఈ టీజర్ అంచనాలను మరింత పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News