Sunday, January 19, 2025

‘రాబిన్‌హుడ్’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో తనతో బ్లాక్‌బస్టర్ భీష్మ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల… నితిన్ సరసన నటిస్తోంది. మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్‌హుడ్ మార్చి 28న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో నితిన్ స్లీక్ స్పెషల్ ఏజెంట్ అవతార్‌లో డైనమిక్‌గా కనిపించారు. కేతికా శర్మ నటించిన సెకండ్ సింగిల్ కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఫస్ట్ సింగిల్, గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News