Wednesday, January 22, 2025

మియామీ, ఫ్లోరిడా నగరాల్లో రోబోలతో ఫుడ్ డెలివరీ

- Advertisement -
- Advertisement -

వేతనాలు పెంచాలని కోరుతూ సిబ్బంది కోర్టుకెక్కడంతో ఊబర్ సంస్థ న్యాయ పోరాటాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ చిక్కులన్నీ ఎదుర్కొన్న నేపథ్యంలో డ్రైవర్ల సిబ్బందికి బదులుగా రోబోలతోనే ఫుడ్ డెలివరీ చేయిస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నలక్షంలో ఊబర్ సంస్థ రోబోల సర్వీస్ కోసం ప్రయత్నిస్తోంది. గత మే నుంచి రోబోలతో ట్రయల్స్ సాగిస్తోంది. మియామీ, ఫ్లోరిడా నగరాలలో కొంతమంది వ్యాపారులకు ప్రయోగాత్మకంగా రోబోల తోనే సరకుల రవాణా చేయిస్తోంది. ఈ సర్వీస్ కోసం కార్టికెన్ అనే సంస్థ నుంచి ఆరు చక్రాల రోబోలను తీసుకొంటోంది.

ఇవి 24 పౌండ్ల కార్గోను తీసుకెళ్ల గలవు. ఈ విధంగా మోసుకెళ్లినందుకు మైలుకు 23.93 శాతం ఎక్కువగా చెల్లించవలసి ఉంటుంది. అదే డ్రైవర్లయితే 25 శాతం కమిషన్ తీసుకోవలసి ఉంటుందని ఊబర్ చెబుతోంది. లాస్‌ఏంజెల్స్ లోని సెర్వ్ రోబోటిక్స్, శాన్‌డియెగో, దుబాయ్ సంస్థలు ఈ రోబోలకు సాంకేతిక సామర్థాన్ని సమకూరుస్తున్నాయి. ఎవరి సూచనలు అవసరం లేకుండానే కార్ట్‌కెన్ రోబోలు ఖాళీ బాటల్లో ప్రయాణిస్తాయి. రోడ్లు దాటతాయి. పాదచారులకు ఎలాంటి ప్రమాదం లేకుండా రోడ్లపై తమ పరిధి లోనే సాగుతుంటాయి.

కార్టికెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమెరా ఆధార గమనం, మ్యాపింగ్ టెక్నాలజీని ఈ రోబోలు వినియోగిస్తుంటాయి. పాదచారుల మధ్య నుంచి భద్రంగా స్వయంగా గమ్యం చేరగల చిన్నసైజు వాహనాలను కూడా కార్టికెన్ సంస్థ తయారు చేయగలుగుతోంది. కార్టికెన్ రోబోలు గంటకు మూడు మైళ్లు వరకు వెళ్ల గలుగుతాయి. వర్షం కురిసినా, మంచు దట్టంగా కమ్ముకున్నా ఎలాంటి వాతావరణాన్నైనా అధిగమించి సర్వీస్ చేయగలుగుతాయి. డెలివరీ రోబోలు మియామీ డేడ్ కౌంటీలో డేడ్‌ల్యాండ్ ఏరియాలో వస్తువులను మొదట రవాణా చేస్తాయి. మిగతా నగరాలకు 2023లో ఈ రోబో సర్వీస్ విస్తరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News